Wednesday, December 7, 2011
Saturday, March 26, 2011
ఏడుపు
మనిషి అహంకారం పొరలు ఎన్నో
ఒక్కొక్కటి ఒలుస్తుంటే ఎంత ఏడుపో!
నోరులేని పసివాడు
నోరుంది కనుక కష్టపడి కన్నాను అంటుంది తల్లి
నోరులేని పసివాడు పాపం యెట్లా చెప్తాడు పుట్టడం ఎంత యాతనో !
Friday, March 25, 2011
చావు పుట్టుకలు
చావు పుట్టుకలు సియామి కవలలు
ఒకటి ఏడిపిస్తుంది మరొకటి నవ్విస్తుంది !
సంతోషం
సుఖం కోసం నిరంతరాన్వేషణ ..
మరి సంతోషం యెక్కడదొరుకుతుంది!
పాపం!
ఆమె ఒళ్లంతా ఖరీదైన నగలతో వలువలతో సింగారించుకుంది
అంతా చేసి చిరునవ్వు పెట్టుకోవడం మరిచింది పాపం!
Thursday, March 24, 2011
బంధం
బరువు దిగిందని తల్లి చిరునవ్వు
బంధం తెగిందని బిడ్డ ఏడుపు !
వలువలు
విలువల వలువల్లో మనిషి మెరిసిపోతాడు
అవి విసిరేసి నాగరికుడిననిమురిసిపోతాడు .
అస్థిత్వం
తన అస్థిత్వం వెదుక్కోవడమే అసలు లక్ష్యం
అది మరచి మరేదో వెదుకుతూ వేదన పడతాడు మనిషి .
అధికారం
ఒకరి స్వేచ్చని అణిచి అరికట్టేది అధికారం
తన మీద తనకి అధికారం లేని వాళ్ళంతా అధికారులే
మనిషి పారిపోతున్నాడు
ప్రకృతి ఆప్యాయంగా కావిలించుకొంటున్దీ
మనిషి ఆమెను విడిపించుకుని దూరంగా పారిపోతున్నాడు .
Wednesday, March 23, 2011
మహదానందం
ఆకుపచ్చని అడివిలో
ఓ వాన కురుస్తున్న గడియలో
అడివిపూలు యేరుతూ నేను ...
జాలువారే వాన చినుకుల్లో
తరిగిపోతూ పులకరిస్తున్న
పుడమిపై చిందులేస్తూ నేనూ ...
మనస్సు ఆర్ద్రమై కురిసే
నీలిమబ్బుల్ని తాకుతూ నేను ...
వెలుతురు చీకటి సంగమించే
చిరు సంధ్యలోవర్షపు గలగలలు వింటూ
నన్ను నేను మరిచిన హాయిలో
యేవో లోకాలు ఇక్కడే తారసపడిన అబ్బురం తో
ప్రభూ .....నీ గానం .
మనస్సంతా నిండిన మహదానందం !
యాత్రికులం
అందరం రోదసీ యాత్రికులమే ....
అయినా పైన ఏదో వుందని ఆశగా చూస్తాం!
Tuesday, March 1, 2011
Friday, January 14, 2011
వర్షం సాక్షిగా
పెదవి చాటు
ఒదిగిన ఓ మాట
ప్రేమ అయ్యింది! .
చూపు చిక్కిన
వేళ ,దొంగలా ఎటో
బిత్తర చూపు!
మౌనం మాటలై
మనల్ని కలపుతూ
జడి వానైంది !
జడి వానలో
నువ్వు నేను ఒకటై
ఒట్టేసుకున్నాం!
ఆత్మల బంధం
ఇది అని ....ఎన్నడూ
విడిపోమని!
ఒదిగిన ఓ మాట
ప్రేమ అయ్యింది! .
చూపు చిక్కిన
వేళ ,దొంగలా ఎటో
బిత్తర చూపు!
మౌనం మాటలై
మనల్ని కలపుతూ
జడి వానైంది !
జడి వానలో
నువ్వు నేను ఒకటై
ఒట్టేసుకున్నాం!
ఆత్మల బంధం
ఇది అని ....ఎన్నడూ
విడిపోమని!
మధురమైన దాహం
ప్రేమ ఓ దాహం
మధురమైన భ్రమ;
ఎండమావేగా !
ఓ ప్రేమ గీతం
హృదయాన్ని తాకుతూ
ఎటు వెళ్లిందో !
గులాభీ నవ్వు
కళ్ళలో ప్రేమ వర్షం
ఎన్ని కలలో
దాస్తే దాగని
ప్రేమ కాంతి ...ఆ కళ్ళ లో
అంతా నాదేనా !
మధురమైన భ్రమ;
ఎండమావేగా !
ఓ ప్రేమ గీతం
హృదయాన్ని తాకుతూ
ఎటు వెళ్లిందో !
గులాభీ నవ్వు
కళ్ళలో ప్రేమ వర్షం
ఎన్ని కలలో
దాస్తే దాగని
ప్రేమ కాంతి ...ఆ కళ్ళ లో
అంతా నాదేనా !
Sunday, January 9, 2011
హైకూలు
సుదూరాలకి
ఏకాకి పయనంలో
మజిలీలేవి !
అలల గానం
ఆవేశం ఆనందం
ఆ క్షణం క్షణికం !
గువ్వ గూటిలో
చిన్ని కువకువలు
ఒట్టి కలేగా
నిశి రాత్రిలో
కవి గుండెలోలయ
వెన్నెల గీతం
-ఓన్విత
ఏకాకి పయనంలో
మజిలీలేవి !
అలల గానం
ఆవేశం ఆనందం
ఆ క్షణం క్షణికం !
గువ్వ గూటిలో
చిన్ని కువకువలు
ఒట్టి కలేగా
నిశి రాత్రిలో
కవి గుండెలోలయ
వెన్నెల గీతం
-ఓన్విత
Friday, January 7, 2011
ఒక సౌందర్యం కోసం
పూచిన తోటంతా ఈ వేళ ఖాళి అయ్యింది ;
ఒక సౌందర్యం కోసం మరో సౌందర్యం బలిదానం !
ఒక సౌందర్యం కోసం మరో సౌందర్యం బలిదానం !
Subscribe to:
Posts (Atom)
