ఆకుపచ్చని అడివిలో
ఓ వాన కురుస్తున్న గడియలో
అడివిపూలు యేరుతూ నేను ...
జాలువారే వాన చినుకుల్లో
తరిగిపోతూ పులకరిస్తున్న
పుడమిపై చిందులేస్తూ నేనూ ...
మనస్సు ఆర్ద్రమై కురిసే
నీలిమబ్బుల్ని తాకుతూ నేను ...
వెలుతురు చీకటి సంగమించే
చిరు సంధ్యలోవర్షపు గలగలలు వింటూ
నన్ను నేను మరిచిన హాయిలో
యేవో లోకాలు ఇక్కడే తారసపడిన అబ్బురం తో
ప్రభూ .....నీ గానం .
మనస్సంతా నిండిన మహదానందం !
No comments:
Post a Comment