పెదవి చాటు
ఒదిగిన ఓ మాట
ప్రేమ అయ్యింది! .
చూపు చిక్కిన
వేళ ,దొంగలా ఎటో
బిత్తర చూపు!
మౌనం మాటలై
మనల్ని కలపుతూ
జడి వానైంది !
జడి వానలో
నువ్వు నేను ఒకటై
ఒట్టేసుకున్నాం!
ఆత్మల బంధం
ఇది అని ....ఎన్నడూ
విడిపోమని!
Friday, January 14, 2011
మధురమైన దాహం
ప్రేమ ఓ దాహం
మధురమైన భ్రమ;
ఎండమావేగా !
ఓ ప్రేమ గీతం
హృదయాన్ని తాకుతూ
ఎటు వెళ్లిందో !
గులాభీ నవ్వు
కళ్ళలో ప్రేమ వర్షం
ఎన్ని కలలో
దాస్తే దాగని
ప్రేమ కాంతి ...ఆ కళ్ళ లో
అంతా నాదేనా !
మధురమైన భ్రమ;
ఎండమావేగా !
ఓ ప్రేమ గీతం
హృదయాన్ని తాకుతూ
ఎటు వెళ్లిందో !
గులాభీ నవ్వు
కళ్ళలో ప్రేమ వర్షం
ఎన్ని కలలో
దాస్తే దాగని
ప్రేమ కాంతి ...ఆ కళ్ళ లో
అంతా నాదేనా !
Sunday, January 9, 2011
హైకూలు
సుదూరాలకి
ఏకాకి పయనంలో
మజిలీలేవి !
అలల గానం
ఆవేశం ఆనందం
ఆ క్షణం క్షణికం !
గువ్వ గూటిలో
చిన్ని కువకువలు
ఒట్టి కలేగా
నిశి రాత్రిలో
కవి గుండెలోలయ
వెన్నెల గీతం
-ఓన్విత
ఏకాకి పయనంలో
మజిలీలేవి !
అలల గానం
ఆవేశం ఆనందం
ఆ క్షణం క్షణికం !
గువ్వ గూటిలో
చిన్ని కువకువలు
ఒట్టి కలేగా
నిశి రాత్రిలో
కవి గుండెలోలయ
వెన్నెల గీతం
-ఓన్విత
Friday, January 7, 2011
ఒక సౌందర్యం కోసం
పూచిన తోటంతా ఈ వేళ ఖాళి అయ్యింది ;
ఒక సౌందర్యం కోసం మరో సౌందర్యం బలిదానం !
ఒక సౌందర్యం కోసం మరో సౌందర్యం బలిదానం !
Subscribe to:
Posts (Atom)
